YS Jagan : అదానీ సంస్థ లంచం వ్యవహారంలో జగన్ పై ఏసీబీకి ఫిర్యాదు

by Y. Venkata Narasimha Reddy |
YS Jagan : అదానీ సంస్థ లంచం వ్యవహారంలో జగన్ పై ఏసీబీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : అదానీ (Adani )సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jaganmohan Reddy)పై ఏసీబీ (ACB) కి ఫిర్యాదు చేశారు. సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతుచక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్‌కు అదానీ సంస్థ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని అందులో ఆయన పేర్కొన్నారు. సెకితో అదానీ కంపెనీ విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పదంపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అదానీ, జగన్ అమెరికా కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ, జగన్ ముడుపుల వ్యవహారాలపై దర్యాప్తు కోరుతూ విశాల్ తివారీ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

భారత్‌లో సోలార్ ఎనర్జీ ఒప్పందాల కోసం అదానీ గ్రూపు రూ. 2,029 కోట్లు లంచం ఇవ్వజూపిన ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైంది.గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్య కాలంలో అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంతో సహా ఐదు రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు రూ. 2,029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అందులో రూ. 1750 కోట్లు అప్పటి ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని అమెరికా దర్యాప్తు సంస్థలు ప్రకటించిన సంగతి విదితమే.

Advertisement

Next Story

Most Viewed