MP Chamala Kiran : బీజేపీపై పార్లమెంట్ ఆవరణలో ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్

by Ramesh N |
MP Chamala Kiran : బీజేపీపై పార్లమెంట్ ఆవరణలో ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ (Parliament) ఆవరణలో తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ (Ambedkar) రాసిన భారత రాజ్యాంగం పై బీజేపీకి నమ్మకం లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగానికి భారతీయ సంస్కృతికి ఎటువంటి సంబంధం లేదు అని గతంలో చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు అన్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని మల్లించి అధికారంలోకి రావడానికి తప్ప రాజ్యాంగం మీద బీజేపీకి ఎటువంటి నమ్మకం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీ కి ఎప్పుడు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై నమ్మకం, విశ్వాసం గానీ లేదని, 1993లో ఆర్ఎస్ఎస్ (RSS) ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిందని తెలిపారు. భారత రాజ్యాంగం ఒక చెత్త కుప్ప దాంతో హిందువులకు, దేశంలో ఉన్నటువంటి కులాలకు ఏం సంబంధం లేదు అని బీజేపీ చెప్పినట్లు ఆరోపించారు.

2000లో అటల్ బీహార్ వాజ్పేయి ప్రభుత్వంలో ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి అంబేడ్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని (Constitution) రాజ్యాంగంపై నమ్మకం లేదని మాట్లాడారని అన్నారు. 2000లో కే సుదర్శన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రాజ్యాంగానికి భారతీయ సంస్కృతికి ఎటువంటి సంబంధం లేదన్నారని, భగవద్గీత నుంచి కొన్ని అంశాలను రాజ్యాంగంలో చేర్చాలని అన్నట్లు చెప్పుకొచ్చారు. 2017 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా మాట్లాడుతూ అంబేడ్కర్ బ్రిటిష్ సంస్కృతితో భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు ఈ రాజ్యాంగంలోని కొన్ని అంశాలను తొలగించాలని అన్నట్లు వివరించారు. దేశంలో రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలుస్తూ రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ ఖూనీ చేసిందని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed