శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం : జహీరాబాద్ డీఎస్పీ

by Aamani |
శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం : జహీరాబాద్ డీఎస్పీ
X

దిశ, ఝరాసంగం : ప్రజల భద్రత కోసమే జిల్లా ఎస్పీ చెన్నూరి రమేష్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని చిలేపల్లి తండాలో జహీరాబాద్ డివిజన్ పరిధిలోని 100 మంది పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీ నిర్వహించారు. సుమారు 50 ద్విచక్ర వాహనాలను తనిఖీ నిర్వహించారు. సరియైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రత పరిరక్షణ కోసమే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

గతంలో గంజాయి కేసులు దొరకడం ద్వారా జిల్లాలో ఎక్కడైనా కేసులు నమోదైతే చిలెపల్లి తండా పేరు చెబుతున్నారన్నారు. గంజాయి సాగు చేయడం, రవాణా చేయడం నిల్వ ఉంచడం కానీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేసులతోపాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, పథకాలు నిలిచి పోతాయన్నారు. గంజాయి సాగు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, స్థానిక ఎస్సై నరేష్, వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్సైలు రాజేందర్ రెడ్డి, నారాయణ, రాజశేఖర్, ప్రసాద్ రావు, ఏఎస్ఐలు గంగయ్య, మల్లేశం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed