‘దిశ’ ఎఫెక్ట్..స్పందించిన పంచాయతీ అధికారులు

by Aamani |
‘దిశ’ ఎఫెక్ట్..స్పందించిన పంచాయతీ అధికారులు
X

దిశ, గుమ్మడిదల : దిశ దినపత్రికలో శనివారం ప్రచురమైన జాతీయ రహదారిపై పేరుకపోయిన చెత్త.. ప్లాస్టిక్ వ్యర్ధాలను తింటూ అనారోగ్య పాలవుతున్న పశువులు కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంగీత ఆదేశాల మేరకు.. ఆదివారం పంచాయతీ సిబ్బంది జాతీయ రహదారిపై నుంచి పూర్తిస్థాయిలో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సంగీత మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుందని అన్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed