అటవీశాఖ అధికారుల కార్డెన్ సెర్చ్.. దాడికి దిగిన గ్రామస్తులు..

by Aamani |
అటవీశాఖ అధికారుల కార్డెన్ సెర్చ్.. దాడికి దిగిన గ్రామస్తులు..
X

దిశ, ఇచ్చోడ : మండలం కేశపట్నం గ్రామంలో అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లల్లో దాడులు నిర్వహించగా కలప దుంగలు దొరికాయి. వాటిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులపై గ్రామస్తులు ఎదురు తిరిగారు. అయితే ఈ దాడిలో అటవీశాఖ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే అటవీ శాఖ వాహనం పై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed