ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. భారీగా ఐటీ కంపెనీలు

by srinivas |
ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. భారీగా ఐటీ కంపెనీలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్రకు మంత్రి లోకేశ్(Minister Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. భారీగా ఐటీ కంపెనీలు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 8న ప్రధాని మోడీ(Pm Modi) విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి అధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ప్రాజెక్టును ప్రధాని మోడీని ఏపీ కేంద్రమంత్రులు అడుగుతూనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీరందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, గత ఐదేళ్లల్లో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదని లోకేశ్ మండిపడ్డారు.


2014-19లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి చాలా కంపెనీలను తీసుకొచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి కియ కంపెనీ వచ్చిందన్నారు. వైఎస్ జగన్(Ys Jagan) పాలనలో కంపెలన్నీ వెళ్లిపోయాయని విమర్శించారు. జగన్ హయాంలో పాలన గాడి తప్పిందని, ప్రస్తుతం తాము సరైన దారిలో వెళ్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫించన్ రూ. 4 వేలు ఇస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed