- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Israel-Hamas: హమాస్ చెరలో ఇజ్రాయెల్ నిఘా సైనికురాలు.. కాపాడాలంటూ వేడుకోలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్- హమాస్‌ల (Israel-Hamas Conflict)ల మధ్య ఉద్రిక్తతల వేళ ఇటీవల విడుదలైన వీడియో వైరల్ గా మారింది. తమ చెరలో బందీ (Hamas Hostage)లుగా ఉన్న ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఈ వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అందులో 19 ఏళ్ల లిరి అల్బాగ్ (Liri Albag) తన ఆవేదనను వ్యక్తం చేసింది. 450 రోజులకుపైగా తాను హమాస్ చెరలో బందీగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తమను రక్షించాలని ఇజ్రాయెల్ ను కోరారు. అయితే, లిరి అల్బాగ్ ఓ నిఘా సైనికురాలని ఇజ్రాయెల్‌కు చెందిన మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. అయితే, గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ సైనిక స్థావరం వద్ద ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన నిఘా సైనికులు ఉన్నారు. ఆ టైంలోనే మిలిటెంట్ గ్రూప్ దాడి చేసింది. ఈ దాడుల్లో 15 మంది మరణించగా.. లిరితో పాటు మరో ఐదుగురిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.
బాధితురాలి కుటుంబం ఏమందంటే?
ఈ వీడియోపై బాధితురాలి కుటుంబం స్పందించింది. ‘ఆ వీడియోను చూసి ఆందోళన చెందుతున్నాం. లిరి మానసిక వేదనతో ఉన్నట్లు తెలుస్తోంది’ అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వద్ద బందీలుగా ఉన్నవారిని వెంటనే విడిపించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)ని అభ్యర్థించారు. బంధీలుగా ఉన్నవారు మీ సొంతపిల్లలు అనుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఇజ్రాయెల్ సహా ప్రపంచ నేతలను కోరారు. అయితే, హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం(Hostages and Missing Families Forum) మాత్రం అల్బాగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు వారికి కుటుంబానికి అధికారం ఇవ్వలేదని పేర్కొంది. బందీలను విడిపించే ఒప్పందం కోసం ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై హాస్టేజెస్ ఫోరం ఒత్తిడిని పెంచుతోంది. ఇకపోతే, 2023లో ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. వీరిలో 96 మంది గాజాలో ఉన్నారు. కాగా.. 96 మందిలో 34 మంది చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.