- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Prabhas: ఆమెకి బర్త్‌డే విషెస్ చెప్పిన డార్లింగ్ ప్రభాస్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘వర్షం’ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి’ వంటి సినిమాలతో అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ప్రస్తుతం ‘రాజా సాబ్’, ‘కల్కి 2’, ‘సలార్ 2’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
బేసిక్‌గా సోషల్ మీడియాలో చాలా అరుదుగా యాక్టీవ్‌గా ఉండే ప్రభాస్ ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఫొటో షేర్ చేస్తూ.. ‘ఎవర్ టాలెంటెడ్ అయిన దీపిక పదుకొణెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆనందం, విజయం, అంతులేని హ్యాపినెస్‌తో ఇలానే ఉండాలని కోరుకుంటున్న’ అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు దీపికాకి విషెస్ తెలుపుతున్నారు. కాగా ప్రభాస్, దీపిక కలిసి ‘కల్కి 2898 ఏడి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది.