- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2 కు బాగా కలిసొచ్చిన సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన చిత్రబృందం
దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప-2’(Pushpa) బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై ఇన్నిడేస్ అవుతున్నప్పటికీ థియేటర్లలో జనాలు బారులు తీరుతున్నారు. వసూళ్ల విషయంలో కూడా తగ్గేదే అన్నట్లుగా ఉంది. నేషనల్ క్రష్ రష్మిక(National Crush Rashmika) కథానాయికగా నటించిన ఈ సూపర్ హిట్ మూవీ బాహుబలి -2 (Baahubali)ను బీట్ చేయనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పుష్ప-2 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికన అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ పాన్ ఇండియా సినిమాలో పాటలన్నీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న.. సినిమాకు బాగా ప్లస్ అయిన సాంగ్ గంగమ్మ జాతర(Gangamma Jatara song) అని చెప్పుకోవచ్చు. ఈ పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) ఆడవేశం వేసి చీర కట్టి అచ్చం గంగమ్మ లాగే తయారై.. అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ పాట ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ గంగమ్మ జాతర సాంగ్‌ను మూవీ టీమ్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేశారు.