DK Aruna: జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టు కు ఏం సంబంధం?.. జిల్లా కోసం మానాన్న చనిపోయారు: డీకే అరుణ

by Prasad Jukanti |   ( Updated:2025-01-05 07:56:24.0  )
DK Aruna: జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టు కు ఏం సంబంధం?.. జిల్లా కోసం మానాన్న చనిపోయారు: డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు భరోసా ప్రకటన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) విమర్శలు గుప్పించారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఆమె తాజాగా ఓ న్యూస్ చానెల్ తో స్పందించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని రూ. 12 వేలే ఇవ్వడం రైతులను దగా చేయడమేనన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) కు మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి (Jaipal Reddy) పేరు పెట్టడాన్ని ఆమె ఖండించారు. జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టు కు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. పాలమూరు కోసం మా నాన్న అనేక పోరాటాలు చేశారని చెప్పారు. జిల్లా కోసం మా నాన్న, సోదరుడు ప్రాణాలు అర్పించారని అన్నారు.

Next Story

Most Viewed