Apologize: సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

by srinivas |
Apologize: సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటి మాధవీలత(Actress Madhavilatha)కు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) క్షమాపణలు చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మహిళలకు జేసీ పార్క్‌లో వేడుకలకు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జేసీ పార్క్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, అక్కడ గంజాయి బ్యాచ్ వల్ల ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మాధవీలత ప్రశ్నించారు. దీంతో మాధవీ లత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాధవీ లతపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే జేసీ చేసిన వ్యాఖ్యలపై పలువురి నుంచి విమర్శలు వెల్తువెత్తాయి.

దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంతో తాను మాధవిలతపై చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకున్నారు. తన నాలుక స్లిప్ అయిందని చెప్పారు. అందుకు మాధవీలతకు తాను క్షమాపణలు చెబుతున్నానని జేసీ ప్రభాకర్ తెలిపారు. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని బీజేపీ నేతలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed