- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత బీసీ హక్కుల మాటలు హాస్యాస్పదం : బండ్రు శోభారాణి
దిశ, వెబ్ డెస్క్ : బీసీల హక్కు(BC Rights)ల సాధన పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేస్తున్న హడావుడి హాస్యాస్పదమని స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి(Bandru Shobharani)విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బీసీలను నిర్లక్ష్యం చేసిన మీ కల్వకుంట్ల కుటుంబం నిర్వాకాన్ని బీసీలు మరిచిపోలేదన్నారు. బీసీల పట్ల మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మీరు మోసం చేశారని, బీసీ ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అందుకు మీరు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 33శాతం మహిళా రిజర్వేషన్ల పేరుతో నాటకాలు వేసిన కవిత..ఇప్పుడు బీసీల హక్కులంటూ నాటకాలు వేస్తుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ను ఎత్తివేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పునరుద్ధరించిన ధర్నాచౌక్ వద్ధ కవిత ధర్నాకు సిద్ధపడిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుతో దేశంలో తెలంగాణ పరువు తీసి ప్రజల మనోభావాలను కవిత దెబ్బతీసిందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మరిపించేందుకు, బీఆర్ఎస్ లో నాయకత్వ రేసులో ఉన్నానని చాటుకునేందుకే బీసీల పేరుతో కవిత రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. బీసీల హక్కుల కోసం బీసీ నేతలు కొట్లాడలేని పరిస్థితుల్లో తెలంగాణ బీసీ నాయకులు లేరన్నారు. బీసీలకు మీ మోసపూరిత కపట రాజకీయ నాయకత్వం అవసరం లేదన్నారు. అసలు బీఆర్ఎస్ లో బీసీ నాయకులు లేనట్లుగా బీసీ కాని కవిత బీసీ జపం చేస్తూ ఆ పార్టీ బీసీ నాయకులను సైతం అవమానిస్తుందన్నారు. బీసీల హక్కుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, పీసీసీ చీఫ్ గా బీసీని కాంగ్రెస్ పార్టీ నియమించిందని, కుల గణన నిర్వహించిందని శోభారాణి గుర్తు చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత మీ తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, బీఆర్ఎస్ కు పనిచేయని కేసీఆర్ స్థానంలో బీసీని అధ్యక్షుడిగా నియమించి బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కవితకు శోభరాణి హితవు పలికారు.