Aadi Srinivas : ఏలేటి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి : ఆది శ్రీనివాస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-03 05:11:59.0  )
Aadi Srinivas : ఏలేటి.. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి : ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ (BJP) శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయా (Blackmail Politics) లు మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Aadi Srinivas) హెచ్చరించారు. రెండు నెలలకోసారి మీడియా ముందుకొచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేసి హడావిడి చేస్తున్నాడని విమర్శించారు. అవినీతి ,అక్రమాలు అంటు గాలి అంతా పోగేసుకువచ్చి మీడియాలో చెపుతుండటాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారన్నారు. ప్రజాప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు ఆపాలని డిమాండ్ చేశారు. చేతనైతే రాష్ట్రం కోసం కేంద్రం నిధులు తీసుకరావాలన్నారు. మీ వద్ద మంత్రుల అవినీతి, అక్రమాలపై ఆరోపణలకు ఆధారాలుంటే సీఎం రేవంత్ రెడ్డికి అందించవచ్చని.. విచారణ జరిపిస్తారని..లేకుంటే కోర్టులను ఆశ్రయించవచ్చన్నారు.

ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుంటే మీరు కేంద్ర నిధులతో సహకరించకపోగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసుపై ప్రభుత్వం ముందుకుపోతుంటే కేటీఆర్ పైన, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపైన మహేశ్వర్ రెడ్డి ఏనాడు విమర్శలు చేయకుండా ఏడాది కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పదేళ్ల బీజేపీ పాలనలో రైతులకు చేసిందేమి లేదని, ఏటా కోటీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేసేలా ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిందని, రైతు భరోసా పంపిణీకి మా ప్రభుత్వం సిద్ధమవుతుంటే మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed