మాధవి లతపై ఫిర్యాదు.. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-01-03 07:00:37.0  )
మాధవి లతపై ఫిర్యాదు.. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జనవరి 2వ తేదీన తాడిపత్రి(Tadipatri)లో పార్క్ చేసిన జేపీ దివాకర్ రెడ్డి(Jc Divakar Reddy) ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ(Bjp) నాయకులు వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి(Jc Phabakar Reddy)గా మారింది. బస్సులు దగ్ధానికి వీళ్లకు సంబంధమేంటని అనుకుంటున్నారా?. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఎల్ అండ్ టీ కంపెనీ పాండ్ యాష్‌ విషయంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు చాలా కాలం నడిచింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu), జేసీ తనయుల చొరవతో ఆ వివాదానికి తెరపడింది అనుకునేలోపే మరో వివాదం తెరపైకి వచ్చింది.

తాడిపత్రిలో ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్(New Year) వేడుకలు జరిగాయి. అయితే తాడిపత్రి మహిళల కోసం జేసీ పార్క్‌లో ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెల్రబేషన్స్ ఏర్పాటు చేశారు. మహిళలు భారీగా పాల్గొని వేడుకలను ఎంజాయ్ చేశారు. అయితే ఈ వేడుకలకు వెళ్లొద్దని నటి, బీజేపీ ఏపీ మహిళా నాయకురాలు మాధవిలత(Madavi latha) పిలుపునిచ్చారు. గంజాయి బ్యాచ్‌లు దాడులు చేస్తే బాధ్యత ఎవరిదంటూ మాధవి లత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తమను గంజాయి బ్యాచ్‌తో పోల్చుతావా అంటూ మాధవి లతపై తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవిలత లాంటి వాళ్లను బీజేపీలో చేర్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే జనవరి 2వ తేదీన తెల్లవారుజామున తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన రెండు బస్సులు పార్క్ చేసి ఉండగానే తగలబడ్డాయి. దీంతో బీజేపీ నేతలే తమ బస్సులను తగలబెట్టించారని జేపీ ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల కంటే జగనే బెటర్ అంటూ ఫైర్ అయ్యారు. ‘‘బీజేపీ వాళ్ళ లాగా జగన్ ఎప్పుడూ నా బస్సులు తగలబెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు...ఇప్పుడేందుకు బాధ పడతాను?. నా బస్సులను కాలుస్తారా ? ఏం చేసుకుంటారో చేసుకోండి.’’ అంటూ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బస్సు దగ్ధం ఘటనపై మాత్రం ఫిర్యాదు చేయలేదు.. పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed