Ap News: CID మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్టుకు రంగం సిద్ధం..?

by srinivas |   ( Updated:2024-11-26 11:30:01.0  )
Ap News: CID మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్టుకు రంగం సిద్ధం..?
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు(Undi MLA Raghurama Krishnamraju) కస్టోడియల్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న CID మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌(CID Former Additional SP Vijay Pal)ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఉదయం నుంచి విచారిస్తున్నారు. గత విచారణలో పోలీసులకు విజయ్‌పాల్ విచిత్రమైన సమాధానాలు చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు గుర్తు లేదని, తెలియదని, మరిచిపోయా అంటూ ‘అదుర్స్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్(Junior Ntr) చెప్పినట్లు చెప్పారు. అయితే తాజాగా సైతం అదే విధంగా సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని విజయ్ ‌పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నిబంధనల ప్రకారం విజయ్ పాల్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

కాగా రఘురామరాజు గత ప్రభుత్వంలో ఎంపీగా సేవలందించారు. నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన ఆయన అధినేత జగన్ తీరుతో ఆ పార్టీకి దూరమయ్యారు. రెబల్ ఎంపీగా కొనసాగుతూనే ప్రభుత్వ తప్పులను ప్రశ్నించారు. దీంతో ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన సమయంలో రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేశారు. కాళ్లు, చేతులపై లాఠీలతో కొట్టారు. అయితే ఆ సమయంలో CID అడిషనల్ ఎస్పీగా విజయ్ పాల్‌ పని చేశారు. ఆయన ఆదేశాలతో తనను కస్టోడియల్ వేధింపులకు పాల్పడ్డారని రఘురామరాజు ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రఘురామరాజు మళ్లీ ఫర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో వేగం పెరిగింది. నిందితుడు విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకుని ఇప్పటికే విచారించారు. కానీ పొంతన లేని సమాధానం చెప్పడంతో మరోసారి సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే సమాధానం చెబుతుండటంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed