- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kharge : ఈవీఎం వద్దు.. బ్యాలెట్ పేపర్‌కు ఓకే : ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో : ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్) విధానం వద్దని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించేలా ‘భారత్ జోడో యాత్ర‘ లాగా దేశమంతా మరో క్యాంపెయిన్ నిర్వహిస్తామన్నారు. బీజేపీ ప్రజలను విడదీసేందుకు స్లోగన్స్ ఇస్తోందన్నారు. దేశంలో ఐకమత్యం ఉండాలంటే బీజేపీ వెంటనే ద్వేషాన్ని ఆపాలన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సింది పోయి అణగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిందని.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ మునిగిపోకుండా ఉండేందుకు కూటమి సభ్యులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. బీజేపీ మెజార్టీలో లేదని మైనార్టీలో కొనసాగుతోందన్నారు. ఒక కాలిని ఏపీ సీఎం చంద్రబాబుపై, మరో కాలిని బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై వేసి ప్రభుత్వాన్ని నడుపుతోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన(యూబీటీ)నేత సంజయ్ రౌత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకూ, కర్ణాటక హోంమంత్రి జీ.పరమేశ్వరలు బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై వీరంతా సందేహాలు వ్యక్తం చేశారు.