- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్ సమయస్ఫూర్తి.. ప్రయాణికురాలికి తప్పిన ముప్పు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీజీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలికి ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భీంగల్ నుండి ఆర్మూర్ కు వెళుతున్న ఆర్మూర్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ టీనేజ్ అమ్మాయి ఫిట్స్ రావడంతో నిల్చున్న చోటనే పడిపోయింది. ఆర్మూర్ కు సమీపంలోని గాంధీనగర్ వద్ద ఈ ఘటన జరిగింది. నోట్లోంచి నురగలు కక్కుతూ పడిపోవడంతో ఏం చేయాలో తోటి ప్రయాణికులకు అర్థం కాలేదు.
వెంటనే బస్ డ్రైవర్ హరీష్ బస్సును రోడ్డు పక్కన ఆపేసి బాధితురాలికి సపర్యలు చేశాడు. అరికాళ్లు, అరచేతులు గట్టిగా రాస్తూ, నుదుటి పై గట్టిగా నొక్కి పడుతూ తనకు తెలిసిన రీతిలో ప్రాథమిక చికిత్స అందించడంతో కొద్ది సేపటికి అమ్మాయి తేరుకుంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే వారు ఆర్మూర్ కు వచ్చారు. డ్రైవర్ హరీష్ అమ్మాయిని వాళ్ల బంధువులకు అప్పగించి, ఆర్టీసీ ఉద్యోగిగా ఉద్యోగ ధర్మాన్నే కాకుండా, సాటి మనిషిగా సామాజిక బాధ్యతను కూడా చాటుకున్నాడు. బస్సులోని ప్రయాణికులు ఆయన మంచితనాన్ని కొనియాడారు.