- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD Metro : మెట్రో రైలు మొదటి దశలో నా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు: ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మెట్రో రైలు ప్రాజెక్టు (HYD Metro Expansion) విస్తరణపై సుదీర్ఘ చర్చలు జరిపామని మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి (N.V.S. Reddy) అన్నారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మొత్తం మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్ల ప్లాన్ చేశామని అన్నారు. ప్రస్తుతం ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు సిద్దం చేసి పంపిచామని తెలిపారు. మేడ్చల్ వైపు కారిడార్ కోసం డిమాండ్లు వస్తున్నాయని, మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిందన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని చెప్పుకొచ్చారు. తర్వలోనే రెండో దశ విస్తరణ పనులు చేస్తామని స్పష్టం చేశారు.
ఒకప్పుడు మెట్రో వద్దని అనేక ఆందోళనలు జరిగాయని, మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం జరిగే సమయంలో తన దిష్టి బొమ్మలు దహనం చేశారని గుర్తుకు చేసుకున్నారు. ఈ రోజు మెట్రో రైల్ అందిస్తున్న సేవలతో అలా చేసిన వారు నేడు పూలదండలతో సత్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో విజయవంతంగా ముందుకు సాగుతోందిని అన్నారు. మెట్రో ట్రైన్ ఏడేళ్లు పూర్తి చేసుకుందని, ఇది సిటీ ప్రజలకే కాదు.. తెలంగాణకు గర్వకారణమని హర్షం వ్యక్తంచేశారు. మెట్రో ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉండి ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్టుగా ప్రతిష్టను సంపాదించిందని తెలిపారు. ముంబై, చెన్నైలో మెట్రో విస్తరణకు భారీగా ఖర్చు చేస్తున్నారని వివరించారు. దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేకపోవడం వల్ల మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు.