Bandi Sanjay: జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేస్తారా?

by Gantepaka Srikanth |
Bandi Sanjay: జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేస్తారా?
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ(Journalist Housing Society)కి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులపై అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించి కొనుక్కున్నా.. ఇండ్ల స్థలాలు రాకుండా చేస్తారా? అని మండిపడ్డారు. సుప్రీంతీర్పు(Supreme Court) కోర్టు తీర్పునకు ముమ్మాటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులే కారణమని ఫైర్ అయ్యారు.

జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేస్తారా? అని సీరియస్ అయ్యారు. మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి జర్నలిస్టులను ఆదుకోవాలని అన్నారు. లేనిపక్షంలో జర్నలిస్టులతో కలిసి ఉద్యమిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టిస్తామని తెలిపారు. జర్నలిస్టులారా? ఆందోళన చెందకండి.. మీకు అండగా మేం ఉంటామని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే జేఎన్జే సొసైటీ సహా అర్హులందరికీ ఇండ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Next Story

Most Viewed