సీఎం పర్యటనకు పోలీసు పటిష్ట బందోబస్తు..

by Sumithra |
సీఎం పర్యటనకు పోలీసు పటిష్ట బందోబస్తు..
X

దిశ, హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హుజుర్ నగర్ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసు అన్ని రక్షణ ఏర్పాట్లు చేశారని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్ తెలిపారు. హుజుర్ నగర్ లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను, మార్గాలు, సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను, హెలిపాడ్ ప్రదేశాన్ని ఎస్పీ, పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ 1500 పోలీసు సిబ్బంది రక్షణ బందోబస్తు నిర్వహిస్తారు అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లా యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంగా పని చేస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి సభకు వచ్చే వారి వాహనాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వాహనాలు ట్రాఫిక్ జామ్ అవకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాల మళ్లింపు, వాహనాల పార్కింగ్ ప్రణాళిక చేశాం అన్నారు. సభా ప్రాంగణానికి చేరుకునేలా అన్ని మార్గాల్లో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారు వారి వాహనాలను ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. మార్గ మధ్యలో పోలీసు వారి సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, DSP శ్రీధర్ రెడ్డి, హుజూర్నగర్ సీఐ చరమంద రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, పోలీసు సిబ్బంది ఉన్నారు.

పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునేది ఇలా..

పాలకవీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి వైపుగా వచ్చే బస్సులు, ట్రక్కులు హుజూర్ నగర్ టౌన్ ఇందిరా గాంధీ చౌరస్తా నుండి కుడివైపుగా వెళ్లి సాయిబాబా థియేటర్ నుండి వెళ్లి గ్రీన్-హుడ్ స్కూల్ వెనకాల నుండి పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవాలి.

పాలకవీడు నేరేడుచర్ల గరిడేపల్లి నుండి వచ్చే కార్లు, ఆటోలు, ఇతర చిన్న వాహనాలు హుజూర్ నగర్ టౌన్ ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద కుడివైపుగా వెళ్లి, శాంతిస్తూపం నుండి ఎడమ వైపుగా KSR కాలని కామిశెట్టి రామయ్య నగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశంలో పార్కింగ్ చేసుకోగలరు.

మఠంపల్లి వైపుగా వచ్చే బస్సులు, ట్రక్కులు చౌటపల్లి, బక్కమంతుల గూడెం గ్రామాల మీదుగా వేపల సింగారం వైపు నుంచి ఎడమ వైపు తిరిగి హుజూర్నగర్ బైపాస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి VPR వెంచర్ వద్ద పార్కింగ్ చేసుకోగలరు.

మఠంపల్లి వైపుగా వచ్చే కార్లు జీపులు ఆటోలు ఇతర చిన్న వాహనాలు వేపల సింగారం వైపు నుండి ఎడమవైపునకు తిరిగి హుజూర్నగర్ బైపాస్ మీదుగా MLA క్యాంప్ ఆఫీస్ నుండి కుడివైపుకు తిరిగిన తర్వాత JSD, పిట్టల రవి వెంచర్ నందు పార్కింగ్ చేసుకోగలరు.

చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల వైపు నుంచి వచ్చే బస్సులు, ట్రక్కులు వేపు సింగారం FCI గోదాం మీదుగా హుజూర్నగర్ బైపాస్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కుడివైపుకు తిరిగి VPR వెంచర్ కాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోగలరు.

చింతలపాలెం, మేళ్లచెరువు వైపు నుండి వచ్చే కార్లు, జీపులు, ఆటోలు వేపుల సింగారం FCI గోదాం మీదుగా హుజూర్నగర్ బైపాస్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి ఎడమవైపుకు వచ్చిన తర్వాత JSD, పిట్టల రవి వెంచర్ ఖాళి ప్రదేశంలో వాహనాలు పార్కు చేసుకోగలరు.

మోతే, నడిగూడెం, మునగాల, అనంతగిరి, కోదాడ పట్టణం మొదలగు ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, ట్రక్కులు హుజూర్నగర్ NSP కాలువ ఎడమవైపు బైపాస్ మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి కుడివైపు వచ్చి VPR వెంచర్ కాళీ ప్రదేశంలో పార్కింగ్ చేసుకోవచ్చు.

మోతే, నడిగూడెం, మునగాల, చిలుకూరు, కోదాడ టౌన్ నుంచి వచ్చే కార్లు జీపులు హుజూర్నగర్ NSP కాలువ ఎడమవైపు మీదుగా ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ నుండి కుడివైపుగా వచ్చి JSD, పిట్టల రవి వెంచర్ ఖాళీ ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోగలరు.

Next Story

Most Viewed