- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యాసంగి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్

దిశ, సంగారెడ్డి : యాసంగి ధాన్యం కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) మాధురి అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మాధురి అధ్యక్షతన సహకార శాఖ ,ఐకెపి, రవాణా, పోలీసు, రెవెన్యూ ,వ్యవసాయ శాఖ, అధికారులతో రైస్ మిల్లర్లు, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024 -25 సంవత్సరానికి జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 195 కేంద్రాలు దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేయనున్నట్లు, 21 కొనుగోలు కేంద్రాలు సన్నరకం ధాన్యం కోసం ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు సహకార శాఖ ఆధ్వర్యంలో, ఐకేపీ ఆధ్వర్యంలో 89 కొనుగోలు కేంద్రాలు, 33 కొనుగోలు కేంద్రాలు డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్ ఎస్ సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యాసంగిలో జిల్లాలో పండిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవ్ రావు , డీసీఎస్ఓ, శ్రీనివాస్ రెడ్డి డీఎస్ఓ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ , జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ , జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.