పక్క సమాచారంతో పోలీసులు వెళ్లారు.. అక్కడ జరిగింది ఇదే!

by Naveena |
పక్క సమాచారంతో పోలీసులు వెళ్లారు.. అక్కడ జరిగింది ఇదే!
X

దిశ,కార్వాన్ : క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురి ముఠా గుట్టును పోలిసులు రట్టు చేసిన ఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దూల్ పేట్ ప్రాంతానికి చెందిన విక్కీ సింగ్ (28)రాకేష్( 39) సందీప్ (26) ముగ్గురికి బెట్టింగ్ అలవాటు ఉంది. ధూల్పేట్ లోని మచిలిపురాలో 2025 ఐపిఎల్ క్రికెట్ లైవ్ బెట్టింగ్ నిర్వహించేందుకు తమిళనాడు చెన్నైలోని ప్రధాన బుకి శైలెందర్ నుంచి వీరు లైన్ నెంబర్లను పొందారు. ఈ క్రమంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిని పక్క సమాచారంతో.. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్,మంగళ్ హాట్ పోలిసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1,04,400 నగదుతో పాటు,6 సెల్ ఫోన్లు,ఒక ఎల్ఈఢీ టీవిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలిసులు తెలిపారు.

Next Story