- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Constitution Day : ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగ పరిరక్షణ.. తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ (PM Modi) రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని పేర్కొంది. రాజ్యాంగాన్ని గౌరవాన్ని కాపాడుతూ మోడీ ప్రజా యోగ్యమైన పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. సత్యమేవ జయతే నినాదమే ఊపిరిగా సదా రాజ్యాంగ రక్షణలో నరేంద్ర మోడీ అంటూ తెలిపింది. న్యాయ వ్యవస్థలో మార్పులు, (Article 370) ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ పరిరక్షణలో భాగమేనని వెల్లడించింది.
రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ నారీశక్తి బిల్లు పరిష్కరణ, రాజ్యాంగబద్ధంగానే ట్రిపుల్ తలాక్ సమస్యకు సమాధానం, రాజ్యాంగానికి లోబడే అయోధ్య వివాదానికి చెక్ పెట్టిన వైనం అంటూ పేర్కొంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉదాత్తమైన విలువలను నిలబెట్టడానికి నా జీవితంలో ప్రతి క్షణం అంకితం చేస్తానని ప్రధాని మోడీ చెప్పిన మాటలను తెలంగాణ బీజేపీ ఎక్స్‌లో మంగళవారం ట్వీట్ చేసింది.