- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాబాలో హైటెన్షన్.. సంగ్రామానికి చేరిన శైలజ మృతదేహం..
దిశ, వాంకిడి : వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థిని శైలజ మృతితో జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో శైలజ మృతదేహాన్ని అంబులెన్స్ లో మండలంలోని సంగ్రామైన దాబాకు తరలించారు. గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ ను స్థానిక గ్రామస్థులంతా ఏకమై చుట్టుముట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన విరమించే లేదని అంబులెన్స్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గ్రామానికి చేరుకుని. తల్లిదండ్రులు, గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మీడియా ప్రతినిధులను ఆ గ్రామానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
పోలీసు పహారాలో వాంకిడి. శైలజ మృతితో జైనూర్ తరహాలో అల్లర్లు జరగొచ్చని భావించి పోలీస్ అధికారులు అప్రమత్తమై ముందస్తుగా వాంకిడి ఆశ్రమ పాఠశాల పరిసరాలతో పాటు దాబా గ్రామానికి వెళ్లే అన్ని దారులను పోలీసులతో దిగ్బంధం చేశారు. మీడియాతో పాటు కొత్తవారిని అటుగా అనుమతించడం లేదు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.