- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: అంతిమయాత్రకు ఆంక్షలా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి(Kondareddypally)కి చెందిన మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన అంతిమయాత్ర సోమవారం జరిగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య సాగింది. అయితే.. అంతిమయాత్రపై ఆంక్షలు విధించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. ప్రజా పాలనా అంటే? అని ప్రశ్నించారు. ఒక మాజీ సర్పంచ్.. 85 ఏండ్ల పెద్ద మనిషి ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వ లేకుండా చేసి, క్షోభ పెట్టి, ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టేసి, ఆఖరికి అంతిమ యాత్రకు కూడా ఆంక్షలు పెట్టడం ఏంటని మండిపడ్డారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలనా అంటే?
— KTR (@KTRBRS) November 26, 2024
ఒక మాజీ సర్పంచ్, 85 ఏండ్ల పెద్ద మనిషి ఇంటికి అడ్డంగా గోడ కట్టి తొవ్వ లేకుండా చేసి, క్షోభ పెట్టి, ఆత్మహత్య చేసుకునే దుస్థితి లోకి నూకి, ఆఖరికి అంతిమ యాత్రకు కూడా ఆంక్షలు పెట్టడమా? pic.twitter.com/9oWek82NXy