- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Special Trains: అయ్యప్ప స్వాములకు భారీ గుడ్ న్యూస్.. శబరిమలకు 62 స్పెషల్ ట్రైన్లు
దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప స్వాములకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అదేవిధంగా మకర జ్యోతి (Makara Jyothi) దర్శనం కోసం భక్తులు లక్షల్లో శబరిమలకు (Sabarimala) తరలివెళ్లే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మొత్తం 62 స్పెషల్ ట్రైన్ల (Special Trains)ను నడపనున్నారు. డిసెంబర్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకూ ట్రైన్లు భక్తులకు అందబాటులో ఉండనున్నాయి.
సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Vishakhapatnam), శ్రీకాకుళం (Srikakulam) నుంచి కొల్లాం (Kollam)కు 44 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం (Vishakhapatnam) - కొల్లాం (Kollam)కు ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ నాలుగు నుంచి ప్రతి బుధవారం నడవనుంది. విశాఖపట్నంలో ఉదయం 8.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాంకు చేరనుంది. చేరుతుంది. మళ్లీ అదే ట్రైన్ కొల్లాం నుంచి విశాఖపట్నం తిరిగి బయల్దేరుతుంది. డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకూ ప్రతి గురువారం ఆ సర్వీసు అందుబాటులో ఉండనుంది. ట్రైన్ కొల్లాం నుంచి ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుతుంది.
అదేవిధంగా శ్రీకాకుళం (Srikakulam) నంచి కొల్లాం (Kollam) మధ్య 18 స్పెషల్ ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) నడపనుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 27 వరకు శ్రీకాకుళం నుంచి కొల్లాంకు ప్రత్యేక రైలు నడపనున్నారు. ఆ ట్రైన్ ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 2.30కు కొల్లాం చేరుతుంది. శబరిమల వెళ్లే భక్తులు ఈ స్పెషల్ ట్రైన్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.