Samantha: ‘సిటాడెల్ సిరీస్ అందుకే చూడలేకపోతున్నా’.. సమంత సంచలన వ్యాఖ్యలు..!!

by Anjali |
Samantha: ‘సిటాడెల్ సిరీస్ అందుకే చూడలేకపోతున్నా’.. సమంత సంచలన వ్యాఖ్యలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్ర హీరోల సరసన నటించి.. అతితక్కువ సమయంలో స్టార్ గుర్తింపు దక్కించుకుంది బ్యూటీ సమంత(Samantha). ఈ బ్యూటీ రీసెంట్‌గా సిటాడెల్: హనీ బన్నీ(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌(Web series)లో నటించింది. తనలోని మరో కోణాన్ని బయటపెట్టి.. సినీ ప్రేక్షకుల్ని అలరించింది. వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటించిన ఈ సిరీస్ నవంబరు 7 వ తారీకున అమెజాన్ లో స్ట్రీమింగ్ అయింది. సమంత భారీ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిందనడంలో అతిశయోక్తిలేదు. ఇదిలా ఉండగా..

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత పలు వ్యాఖ్యలు చేసింది. తను నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తిగా చూడలేకపోయానని వెల్లడించింది. ఎందుకంటే అనారోగ్యంతోనే షూటింగ్‌లోనే పాల్గొన్నానని తెలిపింది. సెట్‌లో చాలా కష్టతరమైన డేస్ ఉన్నాయని పేర్కొంది. మానసికంగా(Mentally), శారీరకంగా(Physically) అనేక సవాళ్లను ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది.

కాగా సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇప్పుడు చూస్తే.. ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఆ అనుభూవాలన్నింటినీ మళ్లీ గుర్తు చేస్తాయని వెల్లడించారు. కాగా సిరీస్ చూడాలంటే బాధగా, కష్టంగా అనిపిస్తుందని వివరించింది. ఈ కారణం వల్లే ఫస్ట్ పార్ట్ ఒక్కటే చూశానని రెండో ఎపిసోడ్ చూడలేకపోతున్నానని సమంత ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఇక నెక్ట్స్ ఈ అగ్రతార రక్త్ బ్రహ్మాండ్(Rakt Brahmand) అనే మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed