- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: దేశ ప్రధానిపై కాల్పులు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..!
దిశ, వెబ్‌డెస్క్/నేషనల్ బ్యూరో: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై గుర్తు తెలియని దుండగుడు(59) కాల్పులు జరిపాడు. ఆయనకు తీవ్ర గాయాలుకావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దేశ రాజధాని బ్రాతిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్‌లోవా పట్టణంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ప్రధాని పాల్గొని తిరిగొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధానిపైకి ఆగంతకుడు నాలుగుసార్లు కాల్పులు జరపగా.. ఒక బుల్లెట్ పొత్తికడుపులోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్సపొందే క్రమంలోనూ ఆయన స్పృహలోనే ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రధానమంత్రికి వైద్య సిబ్బంది విజయవంతంగా అత్యవసర చికిత్సను అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను అత్యవసర సేవల హెలికాప్టర్‌లో రాజధాని బ్రాతిస్లావాకు తరలించారు. ఇక ప్రధానిపై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దాడిని యూరోపియన్ యూనియన్ అధిపతి ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఖండించారు. ఇటువంటి హింసాత్మక చర్యలకు సమాజంలో స్థానం లేదన్నారు.
ఈ భయంకరమైన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. స్లొవేకియా ప్రధాని ఫికో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఫికో స్లొవేకియా ప్రధాని పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. ఆయన కొన్ని అంశాల విషయంలో గతంలో యూరోపియన్ యూనియన్, అమెరికా విధానాలను వ్యతిరేకించారు. ఫికో పాలనా విధానాలను నిరసిస్తూ వేలాది మంది ఇటీవల దేశమంతటా భారీ ర్యాలీలు నిర్వహించారు.