HYD: అయోధ్య ఆలయ నమూనాలో డెకరేషన్.. భాగ్యలక్ష్మీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

by Ramesh Goud |
HYD: అయోధ్య ఆలయ నమూనాలో డెకరేషన్.. భాగ్యలక్ష్మీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు(Diwali Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల వద్ద భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్(HYD) భాగ్యలక్ష్మీ ఆలయం(Bhagya Laxmi Temple) భక్తులతో కిటకిటలాడుతున్నారు. దీపావళి పండుల పర్వదినం సందర్భంగా భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద అయోధ్య ఆలయ నమూనా(Ayodhya Temple Model)ని పోలిన డెకరేషన్(Decorition) ఏర్పాటు చేశారు. దీంతో ఈ అద్భుతమైన డెకరేషన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు(Devotees) తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేగాక ఇక్కడికి వచ్చిన వారికి చార్మినార్(Charminar), భాగ్యలక్ష్మీ దేవి దర్శనంతో పాటు అయోధ్య టెంపుల్ ను కూడా విజిట్ చేసిన అనుభూతి కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story