గత పదేళ్ల పోరాటంతోనే జిల్లాకు ఎయిర్‌పోర్ట్ : ఆదిలాబాద్ ఎంపీ

by Aamani |   ( Updated:2025-04-07 14:32:26.0  )
గత పదేళ్ల పోరాటంతోనే జిల్లాకు ఎయిర్‌పోర్ట్ : ఆదిలాబాద్ ఎంపీ
X

దిశ,ఆదిలాబాద్ : గత ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ఎయిర్పోర్ట్ గడిచిన పదేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగానే వచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు.ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్, తో పాటు విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సహకరించడం శుభ పరిణామం అని చెప్పారు.జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే భూసేకరణ, మౌలిక వస్తువుల ఏర్పాటు జరుగుతుందని, నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా పై దృష్టి సారించి, అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జిల్లాకు రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులు గతంలో రాలేదని, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే గెలిస్తే ఏమవుతుందని అన్న నాయకులకు ఎయిర్ ఫోర్స్, ఎయిర్ షిఫ్ట్ సమాధానం అని తెలిపారు. జిల్లా ప్రజల కల ఎయిర్ పోర్టు మంజూరు చేసినందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.సమావేశంలో బిజెపి నాయకులు రాజు,లాలా మున్నా, మయూర్ చంద్ర, నగేష్,జోగు రవి, దినేష్ మాటో లియా, రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్, సుభాష్,రాకేష్, భూమేష్ ,తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed