‘వెయ్యికోట్ల సినిమా తీశావ్ అన్నా’.. మరీ ఇంత సింపుల్‌గా ఉంటే ఎట్లా?

by Gantepaka Srikanth |
‘వెయ్యికోట్ల సినిమా తీశావ్ అన్నా’.. మరీ ఇంత సింపుల్‌గా ఉంటే ఎట్లా?
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న చిన్న సక్సెస్‌లకే కొందరు ఎంతో హంగామా చేస్తుంటారు. పది మందికి తెలిసేలా సెలబ్రేషన్స్ చేస్తారు. వారి నడకలో, మాటలో, బిహేవియర్‌లోనూ అనేక మార్పులు చూపిస్తుంటారు. కానీ ఇతన్ని చూస్తుంటే.. అంత గొప్ప పనిచేసింది ఇతనేనా? అనే అనుమానం కలగడం ఖాయం. అతనే సినీ దర్శకుడు నాగ్ అశ్విన్(Director Nag Ashwin). ఎక్కడికి వెళ్లినా ఒక సింపుల్ టీషర్ట్, పారగాన్ చెప్పులు, నైట్ ప్యాంట్ వేసుకుని వెళ్లిపోతాడు. అతను డైరెక్టర్ అనే సంగతి మార్చిపోయి.. రూ.1000 కోట్ల సినిమా తీశానన్న గర్వం కూడా ఏమాత్రం చూపించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు.

తాజాగా.. ఆయన సింప్లిసిటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్లపై ఎల్లో కలర్‌లోని మారుతీ 800 కారు(Maruti 800 Car)లో ఒక్కడే చక్కర్లు కొడుతున్నాడు. ఆయన్ను గమనించిన ఓ వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది కాస్త వైరల్‌గా మారింది. ఇది గమనించిన నెటిజన్లు నాగ్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెయ్యి కోట్ల సినిమా తీసి ఇంత సింపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నవ్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకొనేతో నాగ్ అశ్విన్ కల్కీ అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దీనికి పార్ట్2 కూడా అతి రాబోతున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed