- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సినిమాల్లోకి రాక ముందు నాగ చైతన్య, అఖిల్ ఎలా ఉన్నారో తెలుసా..? వావ్ మీ లుక్స్ అదిరింది భయ్యా అంటూ నెటిజన్ల కామెంట్స్(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోగా రాణించారు. ఆ తర్వాత అతని వారసుడు అయిన నాగార్జున(Nagarjuna) కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక అతని వారసులైన అఖిల్(Akhil), నాగచైతన్య(Naga Chaitanya)లు కూడా సినిమాల్లో నటిస్తూ హీరోగా రాణిస్తున్నారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా నాగ చైతన్య చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’(Thandel) సినిమాలో నటించి మంచి విజయం సాధించాడు.
ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత(Samantha)తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(shobhitha Dhulipala)తో డేటింగ్‌లో ఉంటూ గత ఏడాది డిసెంబర్ 4న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అఖిల్ మాత్రం హీరోగా ఇప్పటి వరకు మంచి విజయం సాధించలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. రీసెంట్‌గా బడా బిజినెస్ మ్యాన్ కూతురు అయినా జైనాబ్ రవడ్జీ(Jainab Ravdzee)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తండ్రి, కొడుకుల రేర్ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చాలా మందికి నాగ చైతన్య ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉన్నాడో తెలియదు. కానీ ఈ ఫొటో చూస్తే అతను, అఖిల్ ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఇక ఈ పిక్‌లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు ఉన్నారు. కాగా ఈ ఫొటో ‘సూపర్’(Super) మూవీ సినిమా సెట్‌లోనిది కావడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. మీ లుక్స్ అదిరిపోయింది భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.