మిరపకాయల కోసం వెళ్తే చిమ్మిన రక్తం.. ఒకరు మృతి

by Mahesh |
మిరపకాయల కోసం వెళ్తే చిమ్మిన రక్తం.. ఒకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మిరప కూలీల ఆటో బోల్తా పడి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోట పహాడ్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టేకుమట్ల గ్రామానికి చెందిన కూలీలు మిరపకాయలు తెంపడానికి ఆటోలో బయలుదేరి బొప్పారం వెళ్తున్నారు. ఈ క్రమంలో కోటపాడు ఊరిలో కుక్క అడ్డం వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ దానిని తప్పించబోయి సడన్‌గా మలపడంతో.. అదుపుతప్పిన ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటోలు ఉన్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంతో మాదరబోయిన యాదమ్మ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న మిగతా పది మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed