- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు
by Sumithra |

X
దిశ, కల్వకుర్తి /చారగొండ : పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలలోకి వెళితే కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కు చెందిన అరవింద్ చారి (35), కార్తీక్ చారి (32) అనే వ్యక్తులు దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో జరిగిన బంధువుల కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు మంగళవారం బైక్ పై వెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా వేగంగా ఉన్న మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతులు ఇద్దరు వివాహితులే. ప్రమాదం విషయం తెలియడంతో కల్వకుర్తి గాంధీనగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story