DSP భావన అవినీతికి పాల్పడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

by srinivas |   ( Updated:2025-04-21 10:50:41.0  )
DSP భావన అవినీతికి పాల్పడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రొద్దుటూరు DSP భావన(Proddutur DSP Bhavana)పై స్థానిక MLA వరదరాజులురెడ్డి( MLA Varadarajulu Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి(Corruption)కి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోలీస్‌ శాఖ(Police Department)లో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందన్న ఆయన మద్యం షాపు నుంచి డీఎస్పీ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అని వరదరాజులురెడ్డి ప్రశ్నించారు. అక్రమ రేషన్ బియ్యం లారీని DSP వదిలేశారన్నారు. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో మునివర అనే వ్యక్తిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఈ అంశాలపై అధికారులకు ఫిర్యాదుచేస్తానని ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పేర్కొన్నారు.



Next Story

Most Viewed