- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనుమానాస్పదంగా ముగ్గురు యువకులు.. తనిఖీ చేస్తే భయంకర నిజాలు

దిశ, వర్గల్ : అనుమానాస్పద స్థితిలో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద రివాల్వర్, బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, లభించాయి. నేరాలకు పాల్పడానికి వచ్చిన వారు పోలీసులకు దొరికిపోయారు.. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆర్మీ డెంటల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో నివసించే ముగ్గురు యువకులు ఎథి జాజ్ (22), హిదాయత్ అలీ (23), మద్దుర లాలూ (24) బీహార్ రాష్ట్రంలోని ముంగుర్ పట్టణంలో రివాల్వర్ బుల్లెట్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో ఓ హోటల్ లో ఉంటూ ఒంటరి మహిళలపై దాడి కి పథకం వేశారు.
హైదరాబాద్ లో సీసీ కెమెరాలు ఉండటంతో వారి ప్లాన్ ను గ్రామీణ ప్రాంతాలకు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. వర్గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ ముగ్గురు అనుమానాస్పదం గా ఉండడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా యువకుల బ్యాగ్ లో రివాల్వర్, 38 బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, డమ్మీ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్స్, లభించాయి. ఈ ముగ్గురు యువకులు జవహర్ నగర్ దగ్గరలోని అడవి ప్రాంతంలో ఒక రౌండ్ రివాల్వర్ కాల్చడం ప్రాక్టీస్ చేశారు. తరువాత వర్గల్ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి యువకులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ చేసి గజ్వేల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.