Officers : తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు

by Naveena |
Officers : తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు
X

దిశ,కనగల్లు: మండలంలో కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను గురువారం అధికారులు పరిశీలించారు. పర్వతగిరి, జి.ఏడవల్లి, కురంపల్లి, రామచంద్రపురం గ్రామాలలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి.. తడిసిన ధాన్యాన్ని నల్గొండ డిఆర్డిఏ పిడి వై.శేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ..మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథిన్ కాగితాలను కప్పుకోవాలని సూచించారు. ట్రాన్స్పోర్టర్ తో మాట్లాడి లారీలను వెంట వెంటనే పంపించాలన్నారు. కేంద్రాల నిర్వహకులు సైతం లారీలను తెప్పించడంలో అలర్ట్ గా ఉండాలని, ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్టర్లతో టచ్ లో ఉండాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని రైస్ మిల్లర్లతో మాట్లాడతామని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. ఆయన వెంట ఏవో అమరేందర్ గౌడ్, ఏపీఎం సంకు హరి, డిటి జోష్న,సీసీ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి,పోలే విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story