- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA THUDI : మాట తప్పిన వారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదు
దిశ,వనపర్తి : మాట తప్పినవారికి ప్రశ్నించే నైతిక హక్కు లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 592 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రైతులకు రుణమాఫీ చేస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి, అన్నదాతలను మోసం చేసిన బీఅర్ఎస్ పార్టీ నాయకులకు రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 7 లక్షల 12 వేల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. రైతుల చేత చేతులెత్తించడం కాదని రుణమాఫీ అంశంలో బహిర్గతంగా చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
గ్రామాలలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధించిన వారమవుతామన్నారు. పదవులు పోయి పది నెలలు కాకముందే కారు కూతలు కుస్తున్నారని విమర్శించారు. ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇండ్లు, పింఛన్లు, రుణమాఫీ, విద్యుత్ రాయితీ, సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం రేషన్ కార్డులతో సహా అన్ని రకాలైన ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందజేస్తామని కార్యకర్తలకు భరోసా కల్పించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే విజయఢంకా మోగిస్తుందన్నా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేష్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేరు, శ్రీరంగాపురం, పెద్దమందడి, ఖిల్లా గణపురం, వనపర్తి, రేవల్లి, గోపాల్పేట, ఏదుల మండలాల నాయకులు గ్రామాల నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.