- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Suraksha Diagnostics IPO: నవంబర్ 29 నుంచి సురక్షా డయాగ్నొస్టిక్ ఐపీఓ ప్రారంభం.. ఒక్కో ఈక్విటీ షేర్ ధర ఎంతంటే..!
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా(Kolkata) కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ డయాగ్నొస్టిక్ సంస్థ సురక్షా డయాగ్నొస్టిక్స్ లిమిటెడ్(Suraksha Diagnostics Ltd) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) సబ్‌స్క్రిప్షన్ తేదీని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) నవంబర్ 29న ప్రారంభమై డిసెంబర్ 3 వరకు కొనసాగుతుందని తెలిపింది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) నవంబర్ 28న విండో తెరుచుకోనుందని పేర్కొంది. కాగా ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 846 కోట్లను ఆ సంస్థ సమీకరించనుంది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్(Equity share) ధరను రూ. 420- రూ. 441గా కంపెనీ ఖరారు చేసింది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 846.25 కోట్ల విలువైన 1.91 కోట్ల షేర్లను సేల్ చేయనున్నారు. ఐపీఓలో భాగంగా 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు(QIB), 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు(Retail Investors), 10 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు(NII) కేటాయించింది. కాగా సురక్షా డయాగ్నొస్టిక్ డిసెంబర్ 6న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవ్వనుంది.