IPL 2025 : వైభవ్ ఏజ్‌పై ఆరోపణలు.. తండ్రి సంజయ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
IPL 2025 : వైభవ్ ఏజ్‌పై ఆరోపణలు.. తండ్రి సంజయ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : వైభవ్ సూర్యవంశీని 13 ఏళ్లకే వేలంలో రూ.1.10కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యవంశీ వయసుపై వస్తున్న ఆరోపణలపై తన తండ్రి సంజీవ్ మంగళవారం స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ‘8 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయి అండర్-16 పోటీల్లో ఎంపికయ్యాడు. సమస్తిపూర్ వరకు కొడుకును తానే కొచింగ్‌కు తీసుకెళ్లేవాడిని. కుమారుడి క్రికెట్ భవిష్యత్తు కోసం నా భూమిని అమ్మేశాను. ఇప్పటికి ఆర్థిక పరిస్థితులు కుదుటపడలేదు. కొంత మంది వైభవ్ వయసు 15 ఏళ్లు అంటున్నారు. ఎమినిదిన్నర ఏళ్ల వయసులోనే బీసీసీఐ నిర్వహించిన బోన్ టెస్ట్‌కు నా కుమారుడు హాజరయ్యాడు. ఇప్పటికే అండర్-19 ఆడాడు. తాము ఎవరికీ భయపడటం లేదు. వయసు నిర్ధారణ పరీక్షకు సిద్ధంగా ఉన్నాం.’అని అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ నాగ్‌పూర్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో నా కుమారుడు పాల్గొన్నాడు. కేవలం ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేశాడు. అదే మ్యాచ్‌లో మొతత్ం మూడు సిక్సులు, 8బౌండరీలు బాదాడు. కొన్నేళ్ల క్రితం నా కుమారుడు డోరెమెన్‌ను ఇష్టపడేవాడు. రూ.కోటికి వేలంలో కొన్నట్లు అంతా చెబుతున్నారు. నా కుమారుడిని ఆర్థిక అంశాలకు దూరంగా ఉంచాలని భావిస్తున్నా.. వైభవ్ కేవలం క్రికెట్ మాత్రమే ఆడాలనుకుంటున్నాడని సంజయ్ సూర్యవంశీ అన్నారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తివారీ మాట్లాడుతూ.. బీహార్ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన వైభవ్ ప్రయాణం తన ప్రతిభను, కఠోర శ్రమను, అంకిత భావాన్ని తెలుపుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed