- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
దిశ, పటాన్ చెరు : నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సీఆర్ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి రూ.20 కోట్ల 86 లక్షల నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుంచి బానూరు గ్రామం వరకు రూ.కోటి అంచనాతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నందిగామ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.50వేల తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, గోపాల్,. శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో యాదగిరి, పంచాయతీరాజ్ విభాగం డీఈ సురేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.