‘వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌’ అసాధ్యం : ఖర్గే

by saikumar |
‘వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌’ అసాధ్యం : ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో : జాతీయ సమైక్యతా దినోత్సవం(National Unity Day) ( అక్టోబర్ 31) సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ(Pm Naredra modi) చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (AIcc cheif Mallikarjuna Kharge) తోసిపుచ్చారు. పార్లమెంటులో ఏకాభిప్రాయం లేకుండా ఒకేసారి ఎన్నికలు(One Election) (జమిలీ) అసాధ్యమన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఒకేరోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో చేపట్టడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, వీటిని ఎవ్వరూ అడ్డుకోలేరని ప్రధాని మోదీ (Narendra Modi) వెల్లడించిన నేపథ్యంలో ఖర్గే చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘ప్రధాని ఏం చెప్పారో అది చేయరు. జమిలికి సంబంధించిన బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అది జరుగుతుంది. కానీ, అలా సాధ్యపడదు. జమిలి ఎన్నికలు అసాధ్యం’ అని ఖర్గే పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో మాట్లాడిన ఆయన.. జమిలి ఎన్నికల అంశం అనేక రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతో పాటు అనేక సమస్యలతో ముడిపడి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గతంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఒక్కరికీ రూ.15లక్షలు ఇస్తామని హామీలు ఇచ్చిన ప్రధాని.. వాటినే నెరవేర్చలేకపోతున్నారని ఖర్గే గుర్తుచేశారు.

Advertisement

Next Story