Airtel: ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం

by S Gopi |
Airtel: ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు గురువారం తీవ్ర అంతరాయానికి గురైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌తో పాటు పలు సేవలు నిలిపోయాయి. దాంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీలో సైతం కస్టమర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు పెరగ్గా, సోషల్ మీడియాలో సైతం చాలామంది సమస్యలపై పోస్ట్ చేశారు. గురువారం ఉదయం నుంచి ఎక్కువమంది తమ ఫోన్ నుంచి కాల్స్ చేయడంతో పాటు రిసీవ్ చేసుకోలేకపోయామని, కొందరు మెసేజ్ పంపడం కూడా వీలవలేదని చెప్పారు. అలాగే, మొబైల్ ఇంటర్నెట్ సిగ్నల్స్ అస్సలు రాలేదంటూ కొందరు వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ఎయిర్‌టెల్ సిమ్‌తో పనిచేసే మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ వాడే పరికరాలు ఎక్కువ సమయం పాటు 'నో నెట్‌వర్క్' చూపించాయని కస్టమర్లు ఫిర్యాదు చేశారు. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, 42 శాతం మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ అంతరాయాన్ని, ఇతర సేవలలో ఇబ్బందులను ఎదుర్కొనగా, 32 శాతం మంది సిగ్నల్ సమస్య వల్ల ఇబ్బందిపడ్డారు. బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో సైతం సమస్యలు ఎదురవడంతో దానిపై ఆధారపడిన వ్యాపారాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, స్ట్రీమింగ్ సేవలు, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహించేవారు ఇబ్బంది పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed