PM MODI : త్వరలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్, యూనిఫాం సివిల్ కోడ్ అమలు

by saikumar |   ( Updated:2024-10-31 10:36:57.0  )
PM MODI :  త్వరలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్, యూనిఫాం సివిల్ కోడ్ అమలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో త్వరలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్(One nation, One Election).. యూనిఫాం సివిల్ కోడ్’(Uniform civil code) అమలు చేసి తీరుతామని.. వీటిని ఎవరూ అడ్డుకోలేరని ప్రధాని మోడీ(Prime minister modi) మరోసారి స్పష్టం చేశారు. గురువారం అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా ‘రాష్ట్రీయ ఎక్తా దివస్’(National Unity Day) వేడుకలు గుజరాత్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రధాని ప్రసంగానికి ముందు రాష్ట్రంలోని కెవడియాలో నిర్వహించిన యూనిటీ ఆఫ్ పరేడ్‌లో మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మేము ఇప్పుడు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాము. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ కలను సాధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘యూనిఫాం సివిల్ కోడ్’ సైతం అమల్లోకి వచ్చి తీరుతుంది. దీనిని అడ్డుకోవడానికి దేశంలో కొత్త చీకటి శక్తులు పనిచేస్తున్నాయి. దేశంలో కల్లోలం సృష్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే దేశప్రయోజనాలను దెబ్బతీయడంపై దృష్టి పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశం పరువు తీస్తున్నాయి. సాయుధ దళాల్లో వేర్పాటువాదాన్ని ప్రేరేపించడమే వారి ప్రధాన లక్ష్యం. కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని ముక్కలు చేసేందుకు చూస్తున్నారు. దేశాభివృద్ధి వారి లక్ష్యం కాదు.

ఆర్టికల్ 370(Article 370) ముగిసిపోయిన అధ్యాయం. అభివృద్ధికి అడ్డుగా మారిందనే దానిని తొలగించాం. మరల దాన్ని తిరిగి తీసుకురావడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదు. అది కేవలం కలే అవుతుంది. ప్రాంతీయ భాషల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. దేశంలో కల్లోలం సృష్టించాలనుకునే అర్బన్ నక్సల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. గత పదేళ్లుగా జాతీయ భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సరిహద్దుల్లో చొరబాట్లను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో పాటు వారిని మట్టుబెడుతున్నాయి. ఇకపై దేశభద్రత కోసం రాజీపడేది లేదు’ అని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed