- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arrest : వీసాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపి..
దిశ,రాజంపేట : విదేశాల్లో కాసులు కురిపించే ఉద్యోగాలు ఉన్నాయని వీసాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని గురువారం రాజంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం... దోమకొండ గ్రామానికి చెందిన మల్లేష్ గౌడ్ అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేసి రాజంపేట మండలం లో ముగ్గురు నిరుద్యోగుల నుంచి వీసా ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులు వాసులు చేశాడు. మోసం చేశాడంటూ బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు.
గత కొంత కాలంగా పరారీలో ఉన్న వ్యక్తి ఖమ్మంలో ఉన్నాడని సమాచారం రావడంతో అక్కడికి బృందంగా వెళ్లిన పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నామని ఆయన తెలిపారు. నిందితుడిని విచారించగా ఇదే తరహాలో పేరు మార్చుకుని కొత్తగూడెం,పాల్వంచ ప్రాంతాల్లో నిరుద్యోగులను మోసం చేసే విధంగా మరో దందాకు తెరలేపినట్లు బాధితుడు ఒప్పుకున్నాడని అన్నారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కొరకు జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు. అమాయకులే లక్ష్యంగా విదేశాల్లో ఉద్యోగాల పేరిట బురిడీ కొట్టిస్తారని ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.ఈ కేసు ఛేదనలో కృషి చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ రాజేష్ రవీందర్ ను ఎస్సై పుష్పరాజ్ అభినందించారు.