- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికా వార్నింగ్ బేఖాతర్.. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ ప్రణాళికలు!
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. మొన్నటివరకు హమాస్(Hamas), హిజ్బుల్లా(Hijbullah) ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. తాజాగా ఇరాన్(Iran), ఇజ్రాయెల్(Israel) మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా మాజీ ఛీప్ హసన్ నస్రల్లా(Hasan Nasrallah) హత్యకు బదులుగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ అటాక్స్ జరిపిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా పరిగణించిన ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇటీవల ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు జరిపించారు. దీనికి అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా, ప్రతిదాడి చేయరాదని ఇరాన్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
ఈక్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి ముందే ఇరాన్ ప్రతిదాడి(Counter Attack) చేసే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడులకు కచ్చితంగా స్పందిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అమెరికా ఎన్నికలకు ముందే ఈ దాడులు చేయాలని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ స్పందన ఈసారి తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. కాగా, అక్టోబరు 1న టెల్ అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేయగా.. ఇరాన్‌కు సంబంధించిన సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. వీటిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని ఆ దేశ సుప్రీం కమాండర్ చీఫ్ ఖమైనీ స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ఇంతటితో ముగించాలని, పెద్దదిగా చేయరాదని బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇరాన్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మందికి పైగా మరణించారు.