heavy rainfall : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు

by Kalyani |
heavy rainfall : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం 8 గంటలకు వాతావరణ శాఖ నమోదు చేసిన వర్షపాతం జిల్లాలో 224.6 మీమీ నమోదయింది. జిల్లా సరాసరి సగటు వర్షపాతం 20.4 మీమీ ఇవ్వడంతో వర్షాకాలంలో కురిసినట్లుగా కుంభవృష్టి కురవడంతో అతలాకుతలమైంది. వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా మారుమూల మండలమైన పలిమెలలో 42.4 మీమీ, మలహర్ లో 40.2 మీమీ, ఘన్పూర్ లో 34.2 మీమీ, మహాముత్తారంలో 32.8 మీమీ, కాటారంలో 16.2, వర్షపాతం నమోదయింది.

జిల్లాలో ఎక్కువగా రైతులు వరి పంటను సేద్యం చేశారు. కొంత విస్తీర్ణం పొట్ట దశలో ఉండగా మరికొంత పంట కోసే దశలో ఉండగా ఈ కురిసిన వర్షంతో వరి పంట నేలపై పడిపోయింది. పత్తి పంట వర్షానికి తడిసి ముద్దయింది. భారీ వర్షానికి పత్తి చెట్లకు ఉన్న పులి రాలిపోయాయి పత్తి కింద పడిపోయి మట్టిలో కూరుకుపోయింది. ముఖ్యంగా మిర్చి సాగు చేసిన కొందరు రైతులకు మేలు చేయగా ఇటీవల మిర్చి నాటిన రైతులకు కుళ్ళు తెగులుతో దెబ్బ తిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షం రైతులకు కోట్ల రూపాయలు నష్టాన్ని తీసుకువచ్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story