Constitution Day: దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యంగమే బలం- అమిత్ షా

by Shamantha N |   ( Updated:2024-11-26 07:07:51.0  )
Constitution Day: దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యంగమే బలం- అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. దేశ ప్రజలకు 75వ రాజ్యాంగ దినోత్సవ(Constitution Day) శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి వ్యక్తికి న్యాయం, సమాన హక్కులు నిర్ధారించడం రాజ్యాంగం(Constitution) వల్లే సాధ్యమవుతోందన్నారు. జాతీయ ఐక్యత, సమగ్రతకు ఇదే శక్తిమంతమైన మంత్రమని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం కేవలం వేదికపై ప్రదర్శించాల్సిన పుస్తకం మాత్రమే కాదని.. దాని ద్వారా ప్రజాజీవితానికి అత్యున్నత సహకారం అందించడం కీలకమని అన్నారు. ఈ రాజ్యాంగ దినోత్సవం(75Years Of Constitution) రోజున బలమైన, సుసంపన్నమైన, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ పోరాటం పుంజుకోవాలి- ఖర్గే

భారత రాజ్యాంగం మన దేశానికి జీవనాడి అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Congress president Mallikarjun Kharge) అన్నారు. ఇది మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు హామీ ఇస్తుందన్నారు. దేశభక్తి గల పౌరులమైన మనమందరం.. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాలను రక్షించే గురుతరమైన పనిని కలిగి ఉన్నామన్నారు. అందువల్ల, రాజ్యాంగంలోని ప్రతి ఆలోచనను రక్షించడానికి ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. జాతీయోద్యమంలానే(national movement,) భారతదేశ స్వాభావిక తత్వశాస్త్రాన్ని రక్షించే పోరాటం పుంజుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed