'ఉప్పు ఎక్కువ తింటున్న భారతీయులు'.. అధ్యయనంలో వెల్లడి

by Vinod kumar |
ఉప్పు ఎక్కువ తింటున్న భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి
X

వాషింగ్టన్: భారతీయులు ప్రతిరోజు 8 గ్రాములకు పైగా ఉప్పును వినియోగిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. డబ్లూహెచ్‌వో సిఫార్సుచేసిన మోతాదు 5 గ్రాములు కాగా.. అన్ని వర్గాల ప్రజలు 3 గ్రాములు ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. పురుషులు (8.9 గ్రా), ఉద్యోగస్తులు (8.6 గ్రా), పొగాకు వినియోగదారులు (8.3 గ్రా) ఎక్కువగా ఉప్పు తింటున్నారు.

అదేవిధంగా స్థూలకాయులు (9.2 గ్రాములు), అధిక రక్తపోటుగల వ్యక్తుల్లోనూ (8.5 గ్రాములు) సగటు కంటే వినియోగం ఎక్కువగా ఉందని స్పష్టమైంది. అయితే, రోజువారీ ఉప్పు వినియోగాన్ని 5 గ్రాములకు తగ్గించడం వల్ల అధిక రక్తపోటును 25 శాతం మేర తగ్గించవచ్చు. ఇందుకోసం ప్రాసెస్డ్ అండ్ అవుట్‌సైడ్ ఫుడ్ తినడం తగ్గించాలని ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథుర్ అన్నారు.

Advertisement

Next Story