వైన్ షాపులో చోరీ

by Sridhar Babu |   ( Updated:2024-10-09 14:57:16.0  )
వైన్ షాపులో చోరీ
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి వైన్ షాపులో బుధవారం చోరీ జరిగింది. వివరాల్లోకెళ్తే మంగళవారం కలెక్షన్ మొత్తం యజమానులు తీసుకువెళ్లి కౌంటర్​లో సుమారు 10 వేల రూపాయలు ఉంచారు. దాంతో షాపులో చొరబడిన దొంగలు ఆ నగదుతో పాటు రూ. 5600 విలువ చేసే నాలుగు మద్యం బాటిళ్లు, ఒక సెల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట సీఐ, గంభీరావుపేట ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Next Story